Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక లేబర్ కోడ్లకు, విద్యుత్ చట్ట సవరణకు ఏప్రిల్ 5న ఛలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియూ రాష్ట్ర ఉపాద్యాక్షులు భూపాల్ పిలుపు నిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలో జిల్లా సిఐటియూ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (ఎస్సీకేఎస్) రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం దూలం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా భూపాల్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా రెడ్ కార్పెట్స్ వేసి, దేశ సంపదను దోచి పెట్టేందుకే 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలకు మోడీ ప్రభుత్వం వేగం పెంచిందన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం చాలా రక్షణగా ఉంటే, కేవలం రూ.65 వేల కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించారని ఆరోపించారు. రైతులకు అండగా ఉంటామని, మద్దతు ధర ఇస్తామని చెప్పిన మోడీ రైతు వ్యతిరేఖ విధానాలను అమలు చేస్తున్నారన్నారని మండి పడ్డారు. ప్రభుత్వం అదానీకి దేశ సంపదను ఇప్పటికే దోచి పెడుతుందని విమర్శించారు. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, కేసులు పెట్టి, వేధిస్తున్నారని అన్నారు. ఈ విధానాలను ప్రశ్నించి, ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళే కృషి చేస్తున్నామన్నారు. సంపద సృష్టి కర్తలుగా ఉన్న కార్మిక, వ్యవసాయ కార్మిక,రైతుల పట్ల, వారి పోరాటాల పట్ల తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ విధానాలను తిప్పి కొట్టేందుకు ఏప్రిల్ 5న ఛలో డిల్లీ కార్యక్రమం 5 లక్షల మందితో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్మిక వర్గం రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున బయలు దేరుతున్నారాన్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి ఏజె.రమేష్, ఎస్సీకేఎస్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ యరగాని కృష్ణయ్య, గడ్డల శ్రీనివాస్, సూరం ఐలయ్య, కుమార్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : రైతు చట్టాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక, రైతు హక్కులకై ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, సీఐటీయూ డివిజన్ కన్వీనర్ ఎస్.ఏ.నబి పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు భవనం నందు ప్రజాసంఘాల పోస్టర్ అవిస్కరించి వారు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేషన్ శక్తులకు లోబడి రైతు, కార్మికలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు తెచ్చి వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారని, వీరి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని రైతు, కార్మిక, కర్షకకులందరు ఢిల్లీలో ముక్తకంఠంతో నినాదిస్తూ మోడీ విధి విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.