Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యాత్మక ప్రాంతాన్ని గుర్తించి దృష్టి సాధించాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజలు కుక్క కాటుకు గురయ్యే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రజలు కుక్కకాటుకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, వైద్య సేవలు, వృద్ధి నియంత్రణకు శస్త్ర చికిత్సలు నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్, పంచాయతీ, వైద్య, పశు సంవర్ధక అధికారులతో టెలి కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కల కాటు బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కుక్కల వృద్ధిని తగ్గించేందుకు ప్రతి రోజు లక్ష్యాన్ని నిర్దేశించుకుని వృద్ధి నియంత్రణకు నియంత్రణ ఆపరేషన్లు చేయాలని చెప్పారు. సోమవారం నుండి ఆపరేషన్లు ముమ్మరం చేసేందుకు అదనపు వైద్య టీములను ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. కుక్కల రవాణాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. కుక్కలు పట్టుకునే వారిని ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు గురైన ప్రజలకు వేసే వాక్సిన్, మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ కాన్ఫెరెన్సులో డీపీఓ రమాకాంత్, జిల్లా వైద్యాధికారి డా.శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.రవి బాబు, పశు సంర్ధక శాఖ డీడీ డా.పురందర్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.