Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
అవినీతి రహిత సమాజం కోసం ప్రతీఒక్కరూ కృషి చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో అవినీతి పేరుకుపోయిందని దాన్ని అంతమొందిచాలని అక్రమార్కులు, అవినీతి పరులు అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు డబ్బు సంచులతో ఊర్లలో మకాం వేసి ఓట్లను డబ్బులతో కోనుగోలు చేసి రాజకీయ పబ్బం గడుపుకిని సేవా దృక్పదంతో చేయాల్సిన రాయకీయా సేవను బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. బ్యూరో క్రాట్, కార్పొరేట్ వ్యవస్థ ముసుగులో ఉండి అక్కడ సంపాదించిన అక్రమ సంపాదన పెట్టుబడిగా పెట్టి రాజకీయ వ్యభిచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ ప్రయత్నాలు తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వారిని, యువతను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కొత్తగూడెం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వారికి, స్థానికంగా ఉండే వారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి, చెనిగారపు నిరంజన్ కుమార్, సందేల సందీప్, తాటి పాముల హరికృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.