Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం జానంపేట పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ పొలిశెట్టి హరీష్ ఆధ్వర్యం లో యువతకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ పరిధిలోగల గ్రామాలలో యువతతో ఆయన జానంపేటలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో సమస్యలను ప్రతిదీ తెలియజేయాలని కోరారు. అర్హులకు పింఛన్ రాకుండా ఉన్న, ఇతర సమస్యలను తెలియజేస్తే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శశికాంత్, సంకీర్త, మడి అరుణ్, దొరబాబు, కళ్యాణ్, సాయి, కన్నారావు, వినయ్, సురేష్,శివ, నరేష్, అశోక్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.