Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని శాఖల సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు వేయాలి
- ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరణ
- పరిష్కారానికి అధికారులకు ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పైన రైతులకు పరిహారం పెండింగ్‌లో ఉంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల్లో పరిహారం అందించే విధంగా ఆర్డీవోలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖల సిబ్బందికి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే మాసం నుండి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, గైర్హాజర్ అయినా కాలానికి వేతనం చెల్లించబడదని పేర్కొన్నారు. ప్రజావాణిలో సమస్య పరిష్కార కోసం వచ్చిన తర్వాత హాస్టల్లో మణుగూరు మండలం గాంధీ బొమ్మకు చెందిన నీలమ్మ తన తండ్రి లేటు చల్ల వెంకయ్య పేరునున్న సర్వే నంబర్ 16/22లో ఉన్న మూడు ఎకరాల భూమిలో కొంత భూమి సింగరేణి ఓపెన్ కాస్ట్లో పోయిందని, సర్వే రికార్డుల్లో కూడా తన తండ్రి పేరు ఉందని కావున విచారణ నిర్వహించి తనకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భూసేకరణ విభాగం పర్యవేశయులకు మెంబర్స్ చేశారు. దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన ములకపాటి వెంకటేశ్వరరావు తన కుమార్తె సుమలతకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం మంజూరుకు దరఖాస్తు చేసుకున్నామని, దరఖాస్తుకు ఎస్సీ కులా ధ్రువీకరణ పత్రం పెట్టామని క్రైస్తవ మతం తీసుకున్నందున ఎస్సీ కుల ధ్రువీకరణ చెల్లదని తిరస్కరించాలని, తిరిగి బీసీసీ ధ్రువీకరణతో దరఖాస్తు చేయగా మళ్లీ తిరస్కరించాలని, విచారణ నిర్వహించి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలకు చెందిన దోమల కౌసల్య ఇంటి నెంబర్ 5-2-65లో 40 సంవత్సరాల నుండి నివాసి ఉంటున్నామని తమ ఇంటికి మున్సిపాలిటీ నుండి ఇంటి పన్ను రూ.33,631 వేశారని తిరిగి విచారణ నిర్వహించి పన్ను లెక్కింపు చేయాలని చేసిన దరఖా స్తులను పరిశీలించిన కలెక్టర్ పన్ను లెక్కింపు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. తదితర మండలాల నుంచి వచ్చిన దరఖా స్తులను పరిశీలించిన కలెక్టర్ చర్య నిమిత్తం ఆయా అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీఓ, కార్యదర్శులకు ఏకరూప దుస్తులు పంపిణీ
స్వచ్ఛ శ్రీరామనవమి మహా పట్టాభిషేక కార్యక్రమాల నిర్వహణలో పారిశుధ్య కార్యక్రమాలు చాలా ప్రధానమైనవి అని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో పారిశుధ్య విధులు నిర్వహించి యంపీఓలు, కార్యదర్శులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసి, మాట్లాడారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వాణకు పట్టణాన్ని 15 జోన్లుగా విభజించామని, ప్రతి జోన్లో పర్యవేక్షణకు 17 ఐఎంపీఓలను 100 మంది కార్యదర్శులను విధులు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 400 మంది పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీపీఓ రమాకాంత్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.