Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
29న హైదరాబాద్లో జరిగే జన చైతన్య యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నందు పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు బృందాలుగా ఈ నెల 17 నుండి రొనసాగిన జన చైతన్యయాత్ర 29న హైదరాబాద్లో ఇందిరాపార్కులో భారీ భహిరంగసభతో ముగుస్తుందని, ఈ సభకు పార్టీ పొలిట్ భ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాష్ కరత్ హాజరు కానున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, దేశ వినాశకర ప్రమాదకర మతోన్మాద విదానాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మ రధం పట్టారని, పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో మతో న్మాద రాజకీయాలకు చోటులేదని అన్నారు. ఈ కార్యక్ర మంలో పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు పొడియం వెంకటేశ్వర్లు, రావుజా, నిమ్మల మదు, జి.లక్ష్మీ నర్సయ్య, తిరపతమ్మ, వీరస్వామి, సార య్య, యం.రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : జనచైతన్య యాత్ర ముగింపు సభ మార్చి 29న హైదరాబాదులో ఇందిర పార్క్ నందు జరగనున్నదని ఈ సభకు భద్రాచలం నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి సీపీఐ(ఎం) శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పిలుపు ఇచ్చారు. పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ సమావేశం ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మచ్చా మాట్లాడుతూ మార్చి 17న ప్రారంభమైన యాత్ర ముగింపు సభ 29 హైదరాబాద్లో జగన్ అన్నదని ఈ సభకు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, ఎన్.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, యు.జ్యోతి, బి.కుసుమ, జీవనజ్యోతి, ఎం.నాగరాజు, కోరాడ శ్రీనివాస్, కుంజా శ్రీనివాస్, జి.లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్న నయ వంచన బీజేపీ ప్రభుత్వాన్ని గడ్డేదించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజె.రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ మండల కమిటీ సమావేశం అలేటి కిరణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎలక్షన్కు ముందు ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు బ్యాంక్లో వేస్తామని హామీచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలకులో బడి మతోన్మాదం, కార్పొరేట్ శక్తులకు లోబడి దుర్మార్గంగా పాలిస్తుందన్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి అబ్దుల్ నబీ, తాళ్లూరి కృష్ణ, సర్వన్, లక్ష్మి, మన్నెం మోహన్ రావు, రాందాస్, సుల్తానా, సంధ్య, వెంకటమ్మ, పద్మ మరియ, రాము పాల్గొన్నారు.