Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
పోషకాహారంతోనే తల్లి బిడ్డలకు ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, బాలామృతం తినడం ద్వారానే పోషక విలువలు లభిస్తాయని జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పోషణ్ పక్షోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో అంగన్వాడీ టీచర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఐసీడీపీ సీడీపీఓ కనకదుర్గ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్వాల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలతా లెనినా, జగన్నాధపురం సర్పంచ్ అనిత, సీడీపీఓ సొసైటీ డైరెక్టర్, చౌగాని పాపారావు, జగన్నాధ పురం పీహెచ్సీ డాక్టర్ రాజు, జిల్లా పోషణ అభియాన్ బాబుసార్, ఏపీఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల పరిధిలోని రాజపురం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నందు సీడీపీఓ నిర్మలజ్యోతి జ్యోతి ఆధ్వర్యంలో 8 మంది గర్భిణీలకు సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు పోషకాలు వుండే ఆహార పదార్థాలను తీసుకోవాలని, అప్పుడే తల్లి బిడ్డలు ఆరోగ్యం ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్లు విజయనిర్మల, శ్రీదేవి, పద్మ, ఏఎన్ఎం వాణి తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : చిరు ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు, పిండి పదార్ధాలు, ప్రొటీన్లతో పాటు ఐరన్, కాలుష్యం అధికంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఐసీడీఎస్ సీడీపీవో జయలక్ష్మి అన్నారు. సోమవారం పోషణ పక్వాడ కార్యక్రమాల్లో భాగంగా సాంబాయిగూడెం సెక్టార్ అంగన్వాడీ-1 కేంద్రంలో సుమారు 60మంది విద్యార్ధులకు రక్త పరీక్షలు నిర్వహించి రక్త శాతం పరిశీలించారు. అనంతరం గర్భిణులకు సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ పద్మ, టీ.భద్రమ్మ, పోషణ అభియాన్ బీసీ కే.నాగేశ్వరరావు, ఏఎన్ఎం నందిని, వెంకట లక్ష్మీ, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.