Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌కు ఈ ఆర్ధిక సంఘం వచ్చిన నిధులు ప్రజా ప్రతినిధులు వారి గ్రామాల్లో ప్రణాళిక బద్దంగా ఖర్చు చేయాలని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య అన్నారు. సోమవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సబ్కా వికాస్ ప్రత్యేక కార్యక్రమం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మెన్ కోరం కనకయ్య మాట్లాడారు. సబ్కా వికాస్ కార్యక్రమంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను 15వ ఆర్థిక సంఘ నిధుల పంపిణీ అనుసరించి తయారు చేయుటకు గాను అన్ని మండలముల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లా ప్రజా పరిషత్‌కు రూ.3.19 కోట్లు ప్రభుత్వం వారు నిధులు కేటాయించారని చెప్పారు. ఈ మొత్తం సంబంధిత జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల నుండి ప్రతిపాదనలను స్వీకరించి, ప్రతిపాదిత పనులను ప్రభుత్వ వెబ్ సైట్ నందు నమెదు చేయడం జరుగుతుందని చెప్పారు. తదుపరి 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా ఆరోగ్య వైద్య శాఖకు చెందిన పినపాక, మంగపేటకు పిహెచ్సి నూతన భవన నిర్మాణాలకు ఒక్కో పిహెచ్సీకి రూ.1.56 కోట్లతో భవణముల నిర్మాణాలకు, రొంపెడు, గుమ్మడివల్లి, పెనగడప, నర్సపురం, జానంపేట, మణు గూరుల పిహెచ్సీలకు మరమత్తుల నిమిత్తం అంచనా విలువ రూ.81.25 లక్షలతో సమావేశం ఆమెదిం చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మెరుగు విద్యాలత, నాగలక్ష్మీ, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.