Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో బాధపడుతున్న శాఖ కార్యదర్శిని పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
కార్యకర్తలకు సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు. సోమవారం అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ శాఖ కార్యదర్శి సక్కుబాయిని పార్టీ పట్టణ కమిటీ బృందం తన నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యం పట్ల పలు సూచనలు చేసి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ పార్టీ సభ్యులకి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బూర్జవ రాజకీయ పార్టీల లాగా కార్యకర్తలను వాడుకొని వదిలేసే పద్ధతి సీపీఐ(ఎం)కి ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు మర్లపాటి రేణుక, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, పారెల్లి సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, సీనియర్ నాయకులు బీబీజీ తిలక్, పట్టణ కమిటీ సభ్యులు బెల్లంకొండ కుసుమ, డి.సీతాలక్ష్మి, ఏజే గౌతమి, జీవనజ్యోతి, యు.జ్యోతి తదితరులు పాల్గొని సక్కుబాయిని పరామర్శించారు.