Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పలు కుటుంబాలను శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సోమవారం పరామర్శించారు. నిరుపేదలైన వారికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ తన కర్తవ్య నిర్వహణలో ఎల్లప్పుడూ ముందుంటున్నారని తెలిపారు. ప్రమాదానికి గురై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని పరామర్శించి తన వంతుగా ఆర్థిక సాయం అందజేస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారని అభిప్రాయపడ్డారు. కోయగూడెం గ్రామపంచాయతీకి చెందిన స్థానిక ఎంపీటీసీ జాల సంధ్య పెద్ద మామ మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని, అదే గ్రామానికి చెందిన జక్కుల సుశీల ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం, కోయగూడెం గ్రామానికి చెందిన పూణెం రామకృష్ణ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడగా తన రెండు కాళ్లు విరిగాయి. పరామర్శించి ఆర్థిక సాయం చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మండలంలోని గ్రావిటీ స్కూల్ చైర్మన్ బోడ పున్య నాయక్ మాతృమూర్తి ఇటీవలే మృతి చెందగా వారి స్వగృహానికి వెళ్లి కుటుం సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, బానోత్ రామా నాయక్, జాల మురళి, గుగులోత్ కృష్ణ, కరుణాకర్, రాకేష్, కాలే అభినరు, తదితరులు ఉన్నట్లు తెలిపారు.