Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
శ్రీరామనవమి మహా పట్టాభిషేకం మహోత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో శ్రీరామనవమి మహా పట్టాభిషేకం మహౌత్సవాలకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం తయారుచేసిన సమాచార పత్రాన్ని భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై తయారుచేసిన ఆడియోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు తగు సమాచార అందించేందుకు కొత్తగూడెం బస్టాండు, రైల్వే స్టేషన్, కిన్నెరసాని, భద్రాచలం టోల్గేట్, మార్కెట్ యార్డ్, విస్తా కాంప్లెక్స్, దేవస్థానం ఏరియా, సబ్ కలెక్టరేట్, తాత గుడి సెంటర్, డిగ్రీ కళాశాల, ఆర్డీవో కార్యాలయం, కూనవరం రోడ్డు, కూరగాయల మార్కెట్, చర్ల రోడ్డు, యూబి రోడ్, ఐటీడీఏ రోడ్డు, జూనియర్ కళాశాల, క్రీడా మైదానం, స్నానాల ఘాట్, గోదావరి, బీఈడీ కళాశాల, అంబేద్కర్ సెంటర్, ఎల్ఐసి కార్యాలయం, ఆదర్శనగర్, తనీషా కళ్యాణ మండపం, సాధువుల మండపం, ఆర్టీసీ బస్టాండ్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులకు కావాల్సిన సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోయిన వ్యక్తులు చిన్నారులు సమాచారాన్ని ఆర్డిఓ కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అలాగే పర్యవేక్షణ అధికారులైన వెంకటరమణ 9441536060, వాల్య 6301582152లకు కాల్ చేసి తెలియజేయాలని చెప్పారు. సమాచార పత్రంలో తలంబ్రాలు కౌంటర్లు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు, అత్యవసర వైద్య సేవలు వివరాలతో పాటు మహౌత్సవాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరిచినట్లు చెప్పారు. అన్ని సమాచార కేంద్రాల్లో సమాచార పత్రాలు అందుబాటులో ఉంటాయని, ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని పొందగలరని ఆయనే చెప్పారు. ఈ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓఆర్ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.