Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-పాల్వంచ
డబుల్ బెడ్ రూమ్ డ్రాలో వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపించి అనర్హులకి కేటాయించిన ఇండ్లను రద్దు చేయాలని సీపీఐ(ఎం) కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టౌన్ కార్యదర్శి లిక్కీ బాలరాజు మాట్లాడుతూ సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలితంగా డబల్ ఇండ్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారు లిస్టును తహసీల్దార్ కార్యాలయంలో బహిర్గతం చేశారని, వాటిలో అభ్యంతరాలు కూడా స్వీకరించారని అన్నారు. అనర్హులకు కేటాయించిన ఇల్లు రద్దుచేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పాత కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పేదలకు పంపిణీ చేసి ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు త్వరగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించి పేదలకు ఖాళీ స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి పూనుకోకపోతే పేదలతో గుడిసెలు వేపిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, సందకూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.