Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శ్రీను, జిల్లా కార్యదర్శి యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ- ఖమ్మం
అసంఘటిత రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ ఫెడరేషన్లలో వివిధ రకాల పేర్లతో పని చేస్తున్న హమాలీల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శ్రీను, జిల్లా కార్యదర్శి యర్రా శ్రీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని ధర్నాచౌక్లో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు తుశాకుల లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు హమాలీలను కనీసం గుర్తించడం లేదని విమర్శించారు. సేవా రంగంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్న హమాలీలను గుర్తించడం, హమాలీల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాలు పెట్టే బడ్జెట్లలో హమాలీలకు వాటాను కేటాయించి, వారి సంక్షేమం కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ అనుబంధ ఫెడరేషన్లలో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పని ప్రదేశాలలో రక్షణ సౌకర్యాలు కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. ఖమ్మం కేంద్రంగా ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని, అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు వంటి డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహించిన ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యమాల్లో ఆల్ హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.మోహన్రావు, జిల్లా నాయకులు దొంగల తిరుపతిరావు, ఎర్ర మల్లికార్జున్, హెచ్ పీరయ్య, మేనాల మల్లికార్జున్, భూక్య వెంకటేశ్వర్లు, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.