Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూరమ్మ జీవితం ఆదర్శవంతం
- భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి నివాళి
- ఎమ్మెల్యే సండ్ర నివాళి
నవతెలంగాణ-కల్లూరు
పేదల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు త్యాగాలు చేస్తూ సీపీఐ(ఎం) బలోపేతం చేస్తూ నర్వనేని సూరమ్మ పుల్లయ్యలు ఎనలేని కృషి చేశారని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు కొనియాడారు. మండల పరిధిలోని తాళ్లూరు వెంకటాపురం గ్రామం చెందిన పోచారం సొసైటీ అధ్యక్షుడు నర్వనేని పెద్ద అంజయ్య మాతృమూర్తి నర్వనేని సూరమ్మ(93) ఆరోగ్య కారణాలతో ఆదివారం రాత్రి మృతి చెందారు. సిపిఎం జిల్లా నాయకులు తాతా భాస్కరరావు, తన్నీరు కృష్ణార్జునరావు, ముదిగొండ అంజయ్యలు సూరమ్మ భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు ముదిగొండ అంజయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభలో మాట్లాడుతూ నర్వనేని పుల్లయ్య నర్వనేని సూరమ్మ ఇద్దరు జీవితమంతా పార్టీ కోసం పనిచేశారని అన్నారు. గ్రామంలో ఎస్సీలు, బీసీలు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి కరువు కాటకాలు వచ్చినప్పుడు వీరందరికీ కూడా వారి ఇంటిలో ఉన్నటువంటి ధాన్యాన్ని అందించే వారిని అన్ని విధాల ఆదుకునేవారన్నారు. అదేవిధంగా భూస్వామ్య కుటుంబం నుండి వచ్చిన కూలీల సమస్యల మీద పోరాటాలు చేసి కూలి రేట్లు పెంచేందుకు విశేషమైన కృషి చేయడంతో పాటు అదేవిధంగా రైతుల పక్షాన కూడా నిలబడి రైతాంగ సమస్యల మీద పోరాటం చేసేవారు. బోడెపుడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట నరసయ్య, వట్టి కొండ నాగేశ్వరరావు, చింతలపూడి జగ్గయ్య, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, హయంలో వీరితో కలిసి పార్టీ కోసం విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కృష్ణార్జున రావు, సూరమ్మ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ నాయకులు చింతలపుడి పురుషోత్తం, నాయుడు చందర్రావు, మోదుగు వెంకయ్య, నాయుడు రవి, నాగార్జున, పారా ప్రకాశం, ఎంపీటీసీ మస్కట్ల దర్గయ్య, మాదల లక్ష్మణరావు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
సూరమ్మకు పలువురు ప్రముఖులు నివాళి
నర్వనేని సూరమ్మ భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, వైరా మాజీ ఎమ్మెల్యే డా.బాణోత్ చంద్రావతి సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ... వారి కుమారులు సొసైటీ చైర్మన్ నర్వనేని పెద్ద అంజయ్య, చిన్న అంజయ్యలను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్టా అజరు కుమార్, కల్లూరు, పెనుబల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, కనగాల వెంకట్రావు, మండల కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, సర్పంచ్లు మోదుగు సుబ్బారావు, గంగవరపు శ్రీనివాసరావు, నాయకులు సరాబు వెంకటేశ్వరరావు,. వల్లభనేని శ్రీనివాసరావు, రామిసెట్టి శ్రీనివాసరావు, పసుమర్తి మోహన్ రావు పలువురు ప్రజా ప్రతినిదులు, ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా మట్టా దయానంద్, తోటకూర శేషగిరిరావు, తదితరులు సందర్శింంచి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పోచారం సొసైటీ సీఈవో మట్ట అంజయ్య సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు.