Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా భద్రపరచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ వెనుక భాగాన ఏర్పాటు చేసిన ఈవీఎం గోడౌన్ ను వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మంగళవారం తెరిచారు. ఇసిఐఎల్ నుండి 2,197 వివి ప్యాడ్స్ జిల్లాకు చేరినట్లు, వాటిని భద్రపరచుటకు గోడౌన్ తెరచామని అన్నారు. వివి ప్యాడ్లను స్కాన్ చేసి భద్రపరచాలన్నారు. గోడౌన్ లోపల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెదలు పట్టకుండా చర్యలు తీసుకోవాలని, అగ్నిమాపక పరికరాలు పనిచేసేలా చూడాలన్నారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకులు రాంబాబు, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి కమర్తపు మురళి, బిజెపి పార్టీ ప్రతినిధి జి.విద్యాసాగర్, సీపీఐ పార్టీ ప్రతినిధి జి.లక్ష్మీనారాయణ, సిపిఎం ప్రతినిధి ఆర్. ప్రకాష్, ఐఎన్సిపార్టీ ప్రతినిధి ఎస్కె.తాజోద్దీన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మర్రి శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.