Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మండల పరిధిలోనే గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన షేక్ మౌలాలి అలియాస్ వెంకయ్యకు ఉమ్మనేని సేవా ఫౌండేషన్ సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను మంగళవారం గోవిందాపురం (ఎల్) గ్రామంలో అందజేశారు. షేక్ మౌలాలి వెన్నుపూస దెబ్బ తినడం వల్ల రెండు కాళ్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఉమ్మనేని లక్ష్మీనారాయణ, వెంకట్రావుల సేవ ఫౌండేషన్, సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ సెక్రెటరీ దామా స్వరూపకి సిపిఎం గ్రామ శాఖ ఉమ్మనేని రవి, కళ్యాణపు బుచ్చయ్య, వల్లంకొండ సురేష్ కలిసి సమస్యను వివరించారు. గతంలో వెంటనే స్పందించి ఖమ్మం మమత హాస్పిటల్లో నెల రోజులపాటు వైద్యం చేపించేందుకు హాస్పటల్‌కు తీసుకెళ్లారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో సిపిఎం గ్రామ శాఖ, ఉమ్మనేని ఫౌండేషన్ సేవ ద్వారా కొంత ఆర్థిక సహాయం ఆనాడు అందజేశారు. అదేవిధంగా మంగళవారం మమత హాస్పిటల్ నుంచి మౌలాలి డిశ్చార్జ్ అయ్యాడు. ఇంటికి వెళ్తున్న సందర్భంగా సత్యసాయి ధాన్య మండలి శాఖ సెక్రెటరీ సభ్యులతో కలిసి నిత్యావసర సరుకులు వారు అందజేశారు. ఈ సందర్భంగా మౌలాలి అలియాస్ వెంకయ్య మాట్లాడుతూ తనకు సహకారం అందించిన ఉమ్మినేని సేవ ఫౌండేషన్‌కు, సత్యసాయి ధాన్య మండల శాఖ సెక్రెటరీ దామా స్వరూపకు, సభ్యులకు సిపిఎం పార్టీ గ్రామ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, సేవా ఫౌండేషన్, సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ సెక్రెటరీ దామా స్వరూప పాల్గొన్నారు.