Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన స్వయం భుజమలాపురం మహా ద్వి క్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు జరుగుతున్న శ్రీవారి వసంత నవరాత్రి బ్రహ్మౌత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం వలె నిర్వహించే చైత్ర శుద్ధ సప్తమిన ఆలయ సంప్రదాయ ప్రకారం మంగళవారం అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీనివాసుని కళ్యాణం అత్యంత వైభోవపేతంగా ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రహ్మౌత్సవాలలో భాగంగా తెల్లవారు జాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, హౌమములు, వేద పారాయణం అర్చకులు నిర్వహించారు. స్వామి వారిని అమ్మ వార్లను నూతన వధూవరులుగా అలంకరణ చేసి పల్లకిలో కళ్యాణ మండపంనకు మంగళ వాయిద్యముల నడుమ తోడుకొని వచ్చారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షా బంధనం, సుముహూర్తం, తలంబ్రాలు వంటి వైదిక ప్రక్రియలను అత్యంత వైభవంగా మురళీమోహన్‌శర్మ దంపతులు శుభలగ కార్యక్రమమును నిర్వహించారు. స్వామి వారి కళ్యాణోత్సవానికి ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్ మోహన్‌రావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, దాతలు తుళ్లూరు కోటేశ్వరరావు, నిర్మల దంపతులు, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఎస్సై ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వలే జమలాపురం గ్రామ పంచాయతీ నుండి గ్రామ సర్పంచ్ మూల్పూరి స్వప్న, మూల్పూరి శ్రీనివాసరావు, కార్యదర్శి సురేష్ బాబు, ఎంపీటీసీ మూల్పూరి శైలజ, ఉప సర్పంచ్ ఉయ్యూరు మల్లిక ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రములు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కెఎన్ఆర్ గ్రానైట్స్ అధినేత తు ళ్లూరు కోటేశ్వరరావు నిర్మల దంపతుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన జమలాపురం పెద్ద చెరువు నందు స్వామి వారిని అమ్మవార్లను ప్రత్యేకంగా తయారు చేసిన హంస వాహనంపై ఉంచి అంగరంగ వైభవంగా తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక కుటుబ సభ్యులు ఉప్పల కృష్ణ మోహన్‌శర్మ, ఉప్పల శ్రీరామ చంద్ర మూర్తి, ఉప్పల వెంకట జయదేవ శర్మ, విజరు దేవశర్మ, రాజీవ్‌శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ కె.విజయకుమారి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.