Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
నవతెలంగాణ-ఇల్లందు
అన్ని రకాల బలవర్ధకంగా ఉండే చిరుధాన్యాలు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మంగళవారం ఇల్లందు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ పక్షము ప్రాజెక్టు సమావేశం నిర్వహించారు. ఏడబ్య్లసి, ఏడబ్య్లటీలు చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ముఖ్యంగా పాల్గొని ప్రసంగించారు. పిల్లలకు కావాల్సిన పోషకాహారం, ఎదుగుదల తదితర అంశాల గురించి మాట్లాడారు. స్టేట్ ప్రాజెక్టు టీం సభ్యులు రాహుల్, కల్పన, రవి పోషణ లోపాలు ఎలా అధిగమించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత, వైస్ ఎంపీపీ ప్రమోద్, ఎంపీటీసీ రాము, కోఆప్షన్ సభ్యులు ఘాజి, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, ఎసిడిపి ఓ రత్న కుమారి,విజయ కుమారి, సూపర్వైజర్స్ జ్యోతి, రామ కల,కవితా లక్ష్మిమారి తదితరులు పాల్గొన్నారు.