Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం దివ్య క్షేత్రంలో ఈనెల 30న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవం, 31న జరిగే శ్రీరామ పట్టాభిషేకం వేడుకలకు సంబంధించి ఏర్పాట్లని దాదాపు పూర్తి కావచ్చాయి. దేశ నలుమూలలు నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు ఈ మహౌత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. రామాలయం విద్యుత్ కాంతులతో శోభిల్లుతోంది. పట్టణ పలుకూడాల్లో స్వాగత ద్వారా ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం వేడుకలు నిర్వహించే మిధుల ప్రాంగణం ముస్తాబయింది. భక్తులు కనులారా ఈ వేడుకలను తిలకించే వీలుగా మిధుల ప్రాంగణంలో భారీ కాటన్ ఏర్పాటు చేశారు. అర్చక స్వాములు ఈ వేడుకలను నిర్వహించేందుకు కావలసిన అన్ని వైదికపరమైన ఏర్పాట్లను చేశారు.
తుది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
శ్రీరామనవమి మహాపట్టాభిషేకం వేడుకలు రంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం స్వామివారి వేడుకలు జరగనున్న మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ వేడుకలు వీక్షణకు 26 సెక్టార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సెక్టార్లు భక్తులకు సౌకర్యాలు కల్పనకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. మహౌత్సవాలకు వచ్చే భక్తులు మన అధితులని, వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం చూడాల్సిన బాధ్యత మనందరిపైందని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్‌లను కళ్యాణమండపంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య కేంద్రాన్ని పరిశీలించారు. భక్తులకు 3 లక్షల మంచినీరు ప్యాకెట్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. స్వామి వారు కళ్యాణ మండపానికి వచ్చే సమయంలో భక్తుల రద్దీ లేకుండా పట్టిష్ట భారికేడింగ్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, ఎస్పీ డాక్టర్ వినీత్, దేవస్థానం ఈఓ రమాదేవి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాలలో నవమి ఏర్పాట్లు పరీశీలించిన కలెక్టర్
దుమ్ముగూడెం :ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మంగళవారం పరీశీలించారు. గోదావరి ప్రాంతంలో సీతమ్మ సాగర్ కరకట్ట పనులు జరుతున్నందున గోదావరి ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నానఘట్టాల రేవును ఆయన పరీశీలించారు. ఈ సందర్బంగా ఆయన ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్‌కు పలు సూచనలు చేశారు. గోదావరి ప్రాంతంలో భారీ కేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజీతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. గోదావరి స్నానానికి వెళ్లే భక్తులను ఎప్పటికప్పుడు మైక్ ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. గోదావరి ప్రాంతంలో మహిళలు బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన డ్రస్సింగ్ గదులు పరీశీలించారు. పర్ణశాలకు వచ్చే భక్తులకు శాశ్వత మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ చంద్రమౌళికి సూచించారు. గవర్నర్ తమిళసై ఈ నెల 31వ తేదీన పర్ణశాలకు రానున్నారని బందోబస్తు ఏర్పాట్ల గురించి సీఐ దోమల రమేష్‌తో మాట్లాడారు. ఆలయ ఆవరణ చుట్టూ ఉన్న షాపు లను తొలగించాలని సూచించారు. అనంతరం ఆయన కళ్యా ణ కట్ట ప్రదేశాన్ని పరీశీలించి అక్కడ ఏర్పాటు చేస్తున్న చలు వ పందిళ్లు పరీశీలించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అవసరమైతే భక్తులకు ఫ్యాన్లు ఏర్పాటు చేయా లని సూచించారు. పర్ణశాల దేవస్థానం వారు విద్యుత్ శాఖక ు డీడీ కట్టక పోవడం వలన ఉదయం నుండి విద్యుత్ నిలిపి వేశారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు పోవడంతో వెంటనే ఆయన విద్యుత్ పునరుద్దరించాలని సూచించారు. ఈ ఏడాది పర్ణశాలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున గ్రామపంచాయతీ ఆద్వర్యంలో మిషన్ భగీరధ మంచినీటిని 24 గంటలు అందించాలని, షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పర్ణశాల ఆరోగ్య ఉపకేంద్రం వద్ద వైద్యశిభిరం ఏర్పాటు చేయాలని ఎక్కువ మొత్తం ఏఆర్ఎస్ ప్యాకెట్టు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారి రేణుకారెడ్డికి సూచించారు. నవమి ఏర్పాట్ల పై నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందని అధికారులు ఎప్పటి కప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపిఓ ముత్యాలరావు, ఆర్ఐ లక్ష్మయ్య, పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు.