Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా, వినతి
నవతెలంగాణ-పాల్వంచ
హమాలీల సమస్యలను ప్రభుత్వం పట్టించు కోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్ హెచ్చరించారు. మంగళవారం హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల అమలు చేయాలని కోరుతూ తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా వ్యాప్తంగా వందల మంది అమరులు పాల్గొని భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం అల్ హమాలి ఫెడరేషన్ జిల్లా నాయకులు అధ్యక్షతన జరిగిన సభలో ఆయనే మాట్లాడుతూ క్లిష్టమైన కరోనా కాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహణ చేయ డంలో, ప్రజలకు నిత్యావసరాలు సకాలంలో అందిం చడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇటు వంటి హమాలిలు శ్రమ దోపిడీకి గురవుతూ ఎండ నకా, వాననకా పని చేస్తూ, ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక రకాలు పనులు చేస్తూ రోజుకు 10 నుండి 12 గంటలకు ప్రజలకు ప్రభు త్వానికి అనేక రకాల సేవలు చేస్తున్నారని అన్నారు. హమాలిలందరికీ భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేసి 55 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ నెలకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద భీమా సౌకర్యం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం, గుర్తింపు కార్డులు, సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 కేజీలకు మించిన బరువుని నిషేధించాలని డిమాండ్ చేశారు. హమాలీల్లో అర్హులైన ప్రజలందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్లు ఇవ్వాలని, పని ప్రదేశాలలో టాయిలెట్స్, బాత్ రూం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హమాలీలు కోరు తున్న ప్రకారం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై తగిన చొరవ రాష్ట్ర ప్రభుత్వం చూపకపోతే భవిష్యత్తులో దశల వారి ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహా య కార్యదర్శి డి.వీరన్న, ఉపాధ్యక్షులు కె.సత్య, జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, బర్ల తిరుపతయ్య, ఆల్ హమాలి యూనియన్ నాయకులు గట్టయ్య, రాము లు, సాయి, సుబ్రహ్మణ్యం, ఉప్పలయ్య, పోలయ్య, నాగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.