Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-బూర్గంపాడు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని డీసీసీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళవారం మండలంలోని సారపాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంకల్ప సత్య గ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును నిరసిస్తూ సారపాక పట్టణ కేంద్రంలో సంకల్ప సత్యాగ్రహ నిరసన దీక్షను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ దీక్షను మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుగ్గింపూడి కృష్ణారెడ్డి నాయకత్వంలో నిర్వహించారు. టీఎన్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మారం వెంకటేశ్వర రెడ్డి, టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్, భోగల శ్రీనివాసరెడ్డి, భద్రాచలం టౌన్ అధ్యక్షులు సరేళ్ల నరేష్‌లు మాట్లాడారు. ఈ సంకల్ప సత్యాగ్రహదీక్షను మండల తెలుగు దేశం అధ్యక్షులు తాళ్లూరి జగదీష్, మండల మహిళ ఆకుల పద్మ, సీనియర్ నాయకులు కాకర్ల సత్యనారాయణ, నెట్టెం బాస్కర్‌లు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు తాళ్లూరి చక్రవర్తి, మాజీ జెడ్పీటీసీ బట్టా విజరు గాంధీ, జిల్లా మొనారిటి కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ ఖాన్, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, నియోజకవర్గ యువజన నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక నేరగాళ్లకు అండగా బీజేపీ : నాగా సీతారాములు
కొత్తగూడెం : దేశంలో ఆర్థిక నేరగాళ్లకు అండగా బీజేపి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, గుజరాతి దొంగలకు వత్తాసు పలుకుతున్నారని టీపీసీసీ సభ్యులు నాగా సీతా రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నాగా సీతారములు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి నాగా సీతారాములు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ.కరీం పాషా, సుజాతనగర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగార్జున, కిసాన్ కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ అజ్మీర మోహన్, ఓబీసీ జిల్లా కార్య దర్శి బాలు భద్రరావు, సుజాతనగర్ మండలం మైనార్టీ అధ్యక్షులు సైఫుద్దిన్, సీనియర్్ నాయకులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : రాహుల్ గాంధీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని, అనైతికంగా అనర్హత వేటు వేయడాని నిరసిస్తూ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చండ్రుగొండ ప్రధాన సెంటర్లో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొనకండ్ల కొడకండ్ల వెంకట రెడ్డి, మాజీ ఎంపీపీ గూగులోత్ బాబు, సర్పంచులు పద్దం వినోద్ దారావత్ పార్వతి , మాజీ సర్పంచ్ రుక్మిణి, మండల కాంగ్రెస్ నాయకులు కేశ బోయిన నరసింహారావు, నరసింహారావు ఇంజమ్ అప్పారావు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు బొర్రా సురేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్, బీసీ సెల్ అధ్యక్షులు రామకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, బడుగు చిన్ని, బద్రు తదితరులు పాల్గొన్నారు.
మోడీ పతనం ప్రారంభమైంది : తాటి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పతనము ప్రారంభమైందని అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం ప్రధాన సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అనర్హత నిరసనగా దీక్షను మండల కాంగ్రెస్ చేపట్టింది. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కొనకళ్ళ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాబు కేశ బోయిన నర్సింహారావు, మదర్ సాహెబ్, అంతటి రామకృష్ణ, అప్పారావు, పార్వతి బడుగు కృష్ణవేణి, వినోద్, సురేష్, రెడ్డి సురేష్ రాజేశ్వరరావు అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
సంకల్ప సత్యాగ్రహ దీక్ష
మణుగూరు : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎంపీ పదవికి అనర్హుడుగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ సంకల్ప దీక్ష నిర్వహించారు. మంగళవారం అంబేద్కర్ సెంటర్లో పినపాక నియోజకవర్గం స్థాయి దీక్ష మంగళవారం ప్రారంభించారు. ఈ దీక్షలకు సీపీఐ, తెలుగుదేశం, వైయస్సార్ టీపీ, తుడుం దెబ్బ, వివిధ ప్రజా సంఘాలు నాయకులు సంఘీభావం తెలిపాయి. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చందా లింగయ్య, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్, పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, పిరినాకి నవీన్, కేశ్వవ రెడ్డి, ఇక్బాల్, హుస్సేన్, సర్వేశ్వరరావు, గొడిశాల రామనాథం, ఓరుగంటి బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
మండల అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో
కేంద్రంలో మోడీ నిరంకుశ పాలను చరమగీతం పాడాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పీరీనాకి నవీన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ టీపీసీసీ సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్బంగా వారు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి సర్వేశ్వరరావు, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పినపాక మండల అధ్యక్షులు రామనాధం, మండల అధ్యక్షులు బీక్షమయ్య, బీ బ్లాక్ అధ్యక్షురాలు నాగమణి, కరకగూడెం మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.