Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ ఎర్త్ సొసైటీ మున్సిపల్ కమిషనర్‌కి వినతి
- స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుకు కమిషనర్‌కు సన్మానం
నవతెలంగాణ-పాల్వంచ
పట్టణ పరిధిలో ఉన్న ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ మొక్కలు తొలగించాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వచ్చినందుకు కమిషనర్ శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఉన్న కోనోకార్పస్ మొక్కలు తొలగించాలని, మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం రోడ్లు తవ్వి అలానే వదిలివేశారని, వాటిని పునః నిర్మాణం చేయుటకు, అలాగే పైప్ లైన్ లికేజి చాలా చోట్లా ఉందని, నీటి కలిషితం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కావున వాటి నిర్వహణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఆహార విక్రయ కేంద్రాలు (హౌటల్స్ అండ్ రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్) వెనిగర్‌లో ముంచి రోజుల తరబడి ఉన్న వాటిని అమ్ముతున్నారని, ప్రతి హౌటల్ రెస్టారెంట్ ముందు ఫుడ్ సేఫ్టీ అధికారి నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ వ్యర్థం రీసైక్లింగ్‌కు యూనిట్ ఏర్పాటు, స్థల సేకరణ చేయగలరు విజ్ఞప్తి వేశారు. తదితర సమస్యలను మున్సిపల్ కమిషనర్‌కు వివరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఎర్త్ సొసైటీ అధ్యక్షులు బాలినేని సత్యనారాయణ, ట్రెజరర్ దాసరి కిరణ్ కుమార్, సపావట్ బాలకృష్ణ, జనార్దన్ రెడ్డీ, నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు.