Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లందు మున్సిపాలిటీ చైర్మెన్‌కు ఆహ్వానం
- అందరి కృషితో సాధ్యమైంది : చైర్మెన్ డివి
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు రేపు బుధవారం ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం, వ్యర్థ రహిత నగరాల కోసం ర్యాలీకి తెలంగాణ రాష్ట్రం నుండి ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆహ్వానం అందుకున్నారు. ఇరువురు నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి హాజరై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి దేశ వ్యాప్తంగా వ్యర్థ నిర్మూలన కోసం తీసుకున్నటువంటి చర్యలు, ఉత్తమ పద్ధతుల గురించి చర్చించనున్నారు. అనంతరం చెత్త రహిత నగరాల తీర్మానన్ని (Resolve for Garbage Free Cities) ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఇల్లందు పట్టణ కీర్తిని రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపాలిటీ తరఫున ఐదు నిమిషాల వీడియోని ప్రదర్శించనున్నారు.
అభినందించిన ఎమ్మెల్యే హరిప్రియ, ప్రజా ప్రతినిధులు ప్రముఖులు
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు మున్సిపాలిటీ ఎంపిక కావడం మున్సిపల్ చైర్మన్ డివిని కమిషనర్ అంకుల్ షావలిని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్, పాలకవర్గం, ప్రజా ప్రజా ప్రతినిధులు అధికారులు, పట్టణ ప్రముఖులు అభినందించారు.
అందరి కృషితో సాధ్యమైంది : చైర్మెన్ డీవీ
బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఆహ్వానం అందడం చాలా ఆనందంగా ఉందని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు మంగళవారం ప్రకటనలో తెలియజేశారు. పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్, మంత్రి పువ్వాడ అజరు కుమార్, సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ, స్థానిక శాసన సభ్యురాలుహరిప్రియ నాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కౌన్సిలర్లకు, అధికారులు, పార్టీ పెద్దలు, పట్టణ ప్రజల సహకారంతోనే ఈ రోజు ఈ అవకాశం దొరికిందని తెలిపారు.