Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ మండె వీరహనుమంత రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులు ఆర్ధికంగా ఎదగడానికి కొత్తగూడెం సహకారం సంఘం నిరతంరం కృషి చేస్తుందని సహకార సంఘం చైర్మెన్ మండె వీర హనుమంత రావు ఆన్నారు. మంగళవారం చుంచుపల్లిలోని సహకారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం సహకార సంఘం అభివృద్ధి చెందుతూ, రైతులకు నిత్యం సేవ చేయటం జరుగుతుందన్నారు. సహకార సంఘం ద్వార ఎంఆర్పీ ధరలకు సుమారు రూ.1 కోటి 14 లక్షల విలువగల ఎరువులను రైతులకు అందించటం జరిగిందన్నారు. రూ.33 లక్షల విలువగల విత్తనాలను సబ్సిడిపై రైతులకు ఇచ్చామన్నారు. గత వానకాలం పంట సీజన్లో 1075 మంది రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించి ప్రభుత్వం కేటాయించిన మిల్లులకు పంపిచటం జరిగిందని, 1075 మంది రైతుల ఖాతలో రూ.14 కొట్ల 11 లక్షల నగదును జమ చేయటం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి రుణ మాఫీ అయిన 283 మంది రైతులకు పంట రుణాలుగా రూ.1 కోటి ఇవ్వటం జరిగిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 84 మంది రైతులకు నూతన పంటరుణాలను రూ.16 లక్షలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం సహకార సంఘంలో పంట రుణం తీసుకొన్న రైతులు 31 మార్చి 2023 తేది వరకు పంట రుణం వడ్డిలను చెల్లించాలని, అలా చేలించిన రైతుల రుణాలు వాయిదా మీరి ప్రభుత్వం కల్పించే వడ్డీ రాయితీ పథకానికి అర్హులు కారని అలాగే 13 శాతం అపరాధ వడ్డి కట్టవలసి వస్తుందని వివరించారు. సొసైటికి నూతన భవణ నిర్మాణము కోసం సంఘ మహాజన సభ నందు తీర్మానము చేయటం జరిగిందిని, ప్రభుత్వం ప్రకటించిన రూ.90 వేల రుణ మాఫీ పథకంను కొత్తగూడెం సంఘంనకు వర్తింప చేయాలని తీర్మానము చేయటం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్నాధరావు, సొసైటి సీఈఓ పండ్ల సారయ్య, కార్యవర్గ సభ్యులు వేల్పుల మల్లేష్, బండి అమృత రావు, గుగులోతు చందర్, తీట్ల విజయకుమారి, పోటు వెంకటేశ్వరరావు, చంద్రగిరి శ్రీనివాస్ రావు, గుగులోతు విజయ, కంటెం సత్యనారాయణ రైతులు లక్ష్మీపతి, రవిందర్, శ్రీను, తదితరులు పాల్గోన్నారు.