Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి యాజమాన్యం నాణ్యతలేని బంకర్లను నిర్మించి కంపెనీకి తీవ్ర నష్టం చేకూర్చాయని సింగరేణి కాల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలగపల్లి జాన్ విమర్శించారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థకే తలమానికంగా పనిచేస్తున్న డివిజన్ మణుగూరు డివిజన్ అని తెలిపారు. కార్మికులు ఎంతో కష్టపడి యాజమాన్యం నిర్ణయించిన ఉత్పత్తిని కంటే అధికంగా సాధిస్తున్నారని తెలిపారు. కొండాపురం సీఎస్పీలో ఇటీవల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బంకర్లు ఏర్పాటు శేషారన్నారు కానీ నాణ్యత లేకపోవడం వలన కంపెనీ నష్టపోతుందని తెలిపారు. పైనుంచి బొగ్గు కింద పడితే ఐరన్ షెడ్డు రాడ్లు నాణ్యత లేకపోవడం వలన ధ్వంసం అయ్యాయని, ఇంకా ప్రారంభం కాకముందే పగిలిపోయాయని తెలిపారు.