Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
బొగ్గు ఉత్పత్తి, రవాణా దినోత్సవం పురస్కరించుకొని గురువారం జెకె5 ఉపరితల గనిలో గని చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసినట్లు జీఎం షాలెం రాజు తెలిపారు. 16,201 టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసి, జెకె5 ఉపరితల గని చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసి నందుకుగాను ఉద్యోగులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. ఇందుకు సహకరించిన ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు మరియు కార్మిక సంఘ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి బొల్లం వెంకటేశ్వర్లు, కాలరీ మేనేజర్ పులి పూర్ణచందర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ చిన్నయ్య, సేఫ్టీ ఆఫీసర్ శివప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి.శ్రీహరి, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు రంగనాధం, ఫిట్ సెక్రటరీ జి.సంజీవరావు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.