Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-బూర్గంపాడు
గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. గురువారం మండల పరిధిలోని టేకులచెరువు గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఆమె భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని రామాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకుల చెరువు గ్రామ సర్పంచ్ భూక్యా సుజాత, ఉపసర్పంచ్ శ్రీశైలం, గ్రామ కమిటి అధ్యక్షులు పాండవుల దర్గయ్య, వార్డు నెంబర్లు, ఆలయకమిటీ సభ్యులు, సొసైటీ డైరెక్టర్, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు.