Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
పదవి విరమణ పొందిన తరువాతకూడ నా కుటుంబం నా పిల్లలు ఇదే నా ప్రపంచం ఇంతే చాలు అనుకొని సంతృప్తితో శేష జీవితాన్ని గడుపుదాం అనుకునే వాళ్ళు అధికంగా ఉన్న ఈ రోజుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యానవన శాఖలో వివిధ హౌదాల్లో సేవలందించి పదవి విరమణ పొంది మిగిలిన జీవితాని సమాజానికి ఎంతో కొంత చేయాలన్న ఆలోచనతో ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేనున్నానంటూ పలు స్వచ్ఛంద సేవ సంస్థలకు బాధ్యత వహిస్తూ అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పర్యావరణ ప్రేమికుడు భద్రాచలంకు చెందిన గొల్ల భూపతిరావు. గ్రీన్ భద్రాద్రికి గౌరవ అధ్యక్షులుగా భద్రాచలంలో పచ్చదనాన్ని పెంపొందించడంలో విశేష కృషి చేసిన లైన్స్ క్లబ్, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలలో భాగస్వామి అయి అనేక రకాల సేవలు అందిస్తున్న భూపతి రావు తాను నిర్వహించిన సేవలకు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. గౌరవ డాక్టరేట్‌తో పాటు హరిత మిత్ర జాతీయ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. గ్రీన్ భద్రాద్రితో పాటు లైన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలలో ప్రధాన భూమిక పోషిస్తూ పలు రకాల సేవలను అందిస్తున్నారు. పచ్చదనం పెంపొందించడంలో భూపతిరావు చేస్తున్న కృషికి భద్రాచలం ఏఎస్పీ స్థాయి అధికారులు అనేకసార్లు శాలువాలతో సత్కరించారు. భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుండె గోళ్ళ భూపతి రావు శ్రీరామనవమి ముక్కోటి వంటి ఉత్సవాలలో సైతం నేనున్నానంటూ ఏదో ఒక రూపాన యాత్రికులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.