Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశ జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో బీసీ కులగణన చేపట్టాలని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామేష్ మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టకుండా బీసీలను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానికి బీసీలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేంద్రం బీసీ కులగణన చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుంటోదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో బీసీ కులగణన చేపడుతామని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు అవుతున్న ఎందుకు కులగణన చేపట్టడం లేదని ప్రశ్నించారు...? మండల్ కమిషన్కు వ్యతిరేకంగా బీజేపీ కమండల్ యాత్ర చేసింది వాస్తవం కాదా...? కులగణనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది నిజం కాదా...? అని ప్రశ్నించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, మాలోత్ వీరు నాయక్, శారద, నిహారిక, శాంతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.