Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలని చేర్పిస్తేనే కొనసాగింపు, జీతం పెంపు అంటూ నిబంధనలు
- ఇంటింటికీ తిరుగుతున్న బోధన, బోధనేతర సిబ్బంది
- ప్రయివేట్ కార్పొరేట్ యాజమాన్యాల తీరుతో మానసికక్షోభ
నవతెలంగాణ-మణుగూరు
ప్రయివేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్స్ అనే కత్తి వేలాడుతుంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్యను బట్టి వచ్చే విద్యా సంవత్సరంలో జీతాల చెల్లింపు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత ఉంటాయని టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. టార్గెట్ పెట్టి మానసిక శోభకు గురి చేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. మణుగూరు ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్లో కళాశాలలో అనేకమంది బోధన బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా దాదాపు అందరిదీ అదే పరిస్థితి.
ఎండను సైతం లెక్కచేయకుండా
ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ ఐదు నుండి పది అడ్మిషన్లు చేయాలి. అదే కార్పొరేట్ స్కూల్ పనిచేసేవారు 30 నుండి 40 వరకు చేయాల్సిందే. దీంతో ఎండను సైతం లెక్క చేయకుండా టీచర్లు ఇంటింటికీ వెళుతూ మీ పిల్లలను మా స్కూల్లో చేర్పించండి అంటూ తల్లిదండ్రులను బతిమిలాడుతున్నారు. ఇప్పుడే అడ్మిషన్ చేయించుకుంటే ఫీజులో రాయితీ కూడా ఇస్తామని చెప్పారు. అడ్మిషన్ ఫామ్‌లో సంతకం చేసే వరకు పేరెంట్స్‌ను వదలడం లేదు. మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి నాణ్యమైన బోధన అందిస్తాం ఫలితాలు చూడండి అంటూ కరపత్రాలు చూపుతున్నారు. అంతటితో ఆగకుండా తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు తీసుకొని వారికి రోజుకు నాలుగు ఐదు సార్లు ఫోన్ చేస్తున్నారు.
సెలవు రోజుల్లో వెళ్లాల్సిందే రోజూ 10 నుండి 12:00 పని చేయాలని సెలవు రోజులైనా ఆదివారాలు, జాతీయ సెలవులు కూడా స్కూలుకు వెళ్లాల్సిందే అంటూ రాకుంటే జీతం కట్ చేస్తామంటూ సిబ్బందిని బెదిరిస్తున్నారు. కార్పొరేట్ సిబ్బందికి ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలలో విద్యాసంస్థలు అడ్మిషన్ పేరుతో టీచర్లులను మానసికంగా వేధిస్తున్నారు. చాలా విద్యాసంస్థలలో జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. కరోనా కారణంగా రెండేళ్లగా పాఠశాలలు, కళాశాలలు మూతపడడంతో చాలామంది వివిధ పనులు చేసుకుంటున్నారు. ఉన్న టీచర్లు ఆధ్యాపకులకు అడ్మిషన్లు తప్పనిసరి కావడంతో ఇబ్బందులు పడడం తప్పడం లేదు. కుటుంబ పోషణ కష్టంగా ఉన్న ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ పెట్టిన ఆంక్షలుకి తల యోగి నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం సెలవు దినాలను కూడా ఇవ్వడం లేదు. అధికారులకు తెలిసిన ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు.