Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు పుష్కర పట్టాభిషేకం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగంలో సీతారాముల కళ్యాణం జరిగింది. పట్టణంలోని మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహౌత్సవం ఘనంగా జరిగింది. గురువారం ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది. ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామిఅమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు.
నేడు పుష్కర పట్టాభిషేక
రామయ్య కల్యాణం అనంతర మరుసటి రోజు పుష్కర పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై హాజరుకానున్నారు.