Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5న ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలి
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
స్వాతంత్రం కంటే పూర్వమే బ్రిటిష్ కాలంలోనే కార్మికులు కార్మిక సంఘాలు కలిసి సాధించుకున్నటు వంటి హక్కులు కేంద్ర ప్రభుత్వ కాలరాసే కుట్రలు చేస్తుందని, దీన్ని తిప్పి కొట్టేందుకు ఏప్రియల్ 5న జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న పిలుపు నిచ్చారు. గురువారం ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పలు ప్రదేశాల్లో కార్మికులతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వీరన్న మాట్లాడారు. స్వాతత్య్రం కంటే పూర్వ సాధించాకున్న 8గంటల పని దినం, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకొనే హాక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్రలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం యావత్ కార్మిక లోకం ఏప్రిల్ 5వ తారీఖున ఛలో ఢిల్లీ పేరు మీద సమర శంఖం పూరిస్తుందని, ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని వీరన్న పిలుపు నిచ్చారు. సింగరేణి కార్పొరేట్ ఏరియా పరిధిలో ఉన్న బాబు క్యాంప్, సెంట్రల్ వర్క్ షాప్ మెయిన్ వర్క్ షాప్, హెడ్ ఆఫీస్ తదితర ఏరియాలలో ఏప్రిల్ 5న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కరపత్రం, పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం ప్రాంతం నుంచి 1000 మంది ఉద్యోగ, కార్మికులు ఢిల్లీకి కదులుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా మోడీ కార్మిక ఉద్యోగుల కోపాగ్నికి లోను గాక ముందే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని. ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం నాయకులు శ్యామ్, నాగరాజు, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.