Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులు
- సర్పంచ్, సెక్రటరీలను సన్మానించిన ఎంపీపీ, జడ్పిటిసి, మండల పరిషత్ అధికారులు
నవతెలంగాణ-ముదిగొండ
అదొక పండ్రేగుపల్లి ఉమ్మడి పంచాయతీ శివారు కుగ్రామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుగ్రామాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పండ్రేగుపల్లి, ఖానాపురం ఉమ్మడి పంచాయతీగా ఉన్నది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడింది. పండ్రేగుపల్లి పంచాయతీ నుండి విడిపోయి ఖానాపురం నూతన గ్రామ పంచాయతీగా 2018 జనవరిలో తొలిసారిగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామసర్పంచ్ అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలోజి ఉషగోవిందు గెలుపొందారు. నాటినుండి నేటి వరకు రాజకీయాలకతీతంగా, గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం విరామం లేకుండా సర్పంచ్ దంపతులు శ్రమిస్తున్నారు. ఊరు చిన్నది, అభివృద్ధిలో పెద్దదిగా ఆదర్శంగా నిలిచింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ 2020లో ఖానాపురం పంచాయతీలో గ్రామసర్పంచ్ మాలోజు ఉషాగోవిందు ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం హరితహారం నర్సరీ, డంపింగ్ యార్డ్ సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సర్పంచ్ మాలోజి ఉషగోవిందు దంపతులను ప్రశంసించారు. గ్రామంలోనే రోడ్లన్నీ సువిశాలంగా చూడముచ్చటగా ఉండటంతో అధికారులు ప్రజాప్రతినిధులను మంత్రముగ్ధులను చేసింది. సిసి రోడ్లు, మంచినీటి సరఫరా, పచ్చదనం, పరిశుభ్రత, పరిశుధ్యం నిర్మూలనలో పంచాయతీని ప్రగతిపథంలో నిలిపి, గ్రామ ప్రజల అందుబాటులో ఉండి, సమస్యలను పరిష్కారం చేస్తూ అభివృద్ధిలో ఉత్తమ పనితీరును కనపరుస్తూ పంచాయతీని ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా అగ్రగమిగా సర్పంచ్ మాలోజి ఉషాగోవిందు నిలబెట్టారు. ఖానాపురం గ్రామపంచాయతీని, అభివృద్ధిలో అందంగా తీర్చిదిద్దిన సర్పంచ్ మాలోజి ఉషగోవిందును ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి పువ్వాడ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తోపాటు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. గ్రామపంచా యతీలో 9 అంశాలపై ఉత్తమ పనితీరును కనపరిచిన 2021- 22 సంవత్సరానికి మూడు జాతీయ అవార్డులు ఖానాపురం గ్రామపంచాయతీ దక్కించుకున్నది. గ్రామపంచాయతీలో ప్రధానంగా మంచినీటి సరఫరా, పచ్చదనం, పరిశుభ్రత, బాలల సంరక్షణ విభాగంలో మూడు జాతీయ అవార్డులు గ్రామ సర్పంచ్ మాలోజి ఉషాగోవిందు అందుకున్నారు. ఈనెల 24న మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అవార్డుల ప్రధానసభలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, ఎంపీడీవో డి శ్రీనివాసరావు జడ్పిటిసి సభ్యురాలు పసుపులేటి దుర్గ, ఎంపీఓ పి సూర్యనారాయణ గ్రామసర్పంచ్ మాలోజి ఉషగోవిందు, సెక్రటరీ రాంబాబుకు ప్రశంసపత్రాలు, మెమొంటో అందజేసి శాలువతో ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మూడు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామ సర్పంచ్ మాలోజి ఉషగోవిందును పంచాయతీ పాలకవర్గంతోపాటు,గ్రామ ప్రజలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.