Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్తవ్యస్తంగా విద్యుత్ శాఖ పనితీరు
- ప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజల అవస్థలు
- పర్యవేక్షణ లోపం వల్లే సమస్యలు అంటున్న ప్రజలు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండలం పరిసర శ్రామిక ప్రాంతాలలో ప్రజలు విద్యుత్ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. చిరుజల్లులకు గాలులు... వీచాయి అంటే ఇక విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లే. ఇలా కోతకు గురైన కరెంటు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడమే మణుగూరు మున్సిపాలిటీ మండల ప్రజలకు పనిగా మారింది. పట్టణ వ్యాపారులు మాత్రం విద్యుత్ శాఖ అధికారులపై అగ్గి మీద గుగ్గిలంగా మారి మండిపడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కోతలు విధించడం వల్ల అంతంత మాత్రంగా ఉన్న తమ వ్యాపారాలు తాబేలు నడకలా ఉన్నాయని లబోదిబోమంటున్నారు. చిరువ్యాపారుల సంగతి వేరే చెప్పే పని లేకుండా పోతుంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని గందరగోళ పరిస్థితి వారిది. అయితే విద్యుత్ శాఖ అధికారులు మెయింటెనెన్స్ పేరుతో ప్రకటనలు చేస్తూ విద్యుత్ అంతరాయాలు కలిగించి పనులు చేపడుతున్నా మరి ఎందుకు ఆ ప్రకటిత కోతలు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మణుగూరు డివిజన్ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించ డం వల్ల ఇక్కడ జరిగే పనులు ఏదో నామమాత్రంగా జరుగు తున్నాయని, ఇక్కడ ఏడీఈగా పనిచేసే అధికారి భద్రాచలంలోనే సమయం ఎక్కువ కేటాయించడం వల్ల పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందన్న ఆరోపణలు వెళ్ళు వెళుతున్నా యి. పర్యావేక్షణ అధికారి లేకపోవడంతో చేపట్టే పనులు కూడా తూతూ మంత్రముగా జరుగుతు న్నాయని, అందుకే చిరుజల్లులకే చిరుగాలులకే కరెంటు పోతుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
మీటర్ల సమస్య కుప్పలు తెప్పలు
విద్యుత్ మీటర్ల సమస్యల మణుగూరులో తీవ్రస్థాయిలో కనిపిస్తుంది. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్ మీటర్లు పాడైపోవడం సమస్య తలెత్తడంతో విద్యుత్ వినియోగదారుల పడే ఇబ్బందులు చెప్పుకోలేనివిగా ఉంటున్నాయి. మీటర్లలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల అత్యధిక యూనిట్లు నమోదు కావడం తద్వారా కరెంట్ బిల్లులు ఐదు నుండి పదివేలు నెలకే రావడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతిక కారణాలతో మొరాయించే మీటర్ల పై సబ్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి నెలలు గడిచిన కొత్త మీటర్లు ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో ప్రతి నెల పాత బిల్లుతోపాటు కామన్ బిల్ ఆడ్ అవుతూ వినియోగదారునికి మాత్రం బిల్లులు రావడం ఆగడం లేదు. కొత్త మీటర్లు పెట్టకుండా విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల్లో జరిగిన పొరపాట్లను ఇతర సమస్యలను అశోక్ నగర్లోని విద్యుత్ వినియోగదారుల కేంద్రానికి వెళ్ళండి అని ఏఈ ఇతర అధికారులు తెలియజేయగా అక్కడికి వెళ్లిన వినియోగదారులకు మాత్రం ప్రతిఫలం కనిపించడం లేదు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.