Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వైఫల్యాలను...రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్దుతున్న తీరు
- కేంద్ర బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు
- 'జనచైతన్య యాత్ర' ప్రజల ముందు ఉంచింది
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రం బిజేపి ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమ, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రంలో మార్చి 17 నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన జన చైతన్య యాత్రలు విజయవంతం అయ్యాయి. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా స్వామికవాదులు, లౌకిక వాదులు, మేధావులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు యాత్ర ద్వారా ప్రజకు సవివరంగా వివరించాయి. జనచైతన్య యాత్ర పూర్తిగా విజయవంతం అయింది. ఒకే మతం అంటూ హిందూ ఇతర మతాలపై దాడులు సాగిస్తున్న తీరు, దళిత, గిరిజన, మహిళ, మైనార్టీ, బీసీలపై నిరంతరం దాడులు జరుగుతున్న వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 రోల పాటు సాగిన యాత్రలో నాయులు వివరించారు. యాత్ర సందర్భంగా నిర్వహించిన సభలలో ప్రజలుపెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు ప్రసంగాల ద్వారా విషయాన్ని గ్రహించారు. కేంద్రం పెంచుతున్న ధరలు రాష్ట్రప్రభుత్వం పెంచుతుందని ఉన్న అపోహలు తొలగించుకున్నారు. కేంద్రం ప్రభుత్వ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలుపై సామాన్య ప్రజానీకం స్పష్టమైన అవగాహన పెంచుకున్నారు. ముఖ్యంగా రాజ్యాంగ యంత్రాంగం, న్యాయవ్యవస్థ, గవర్నర్ల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ నాయకులతో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న తీరు పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది.
జిల్లాలోయాత్ర విజయవంతం : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర ఈనెల 19వ నుండి 21వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెంలో సాగిందింది. 3 రోజుల పాటు సాగిన జనచైతన్య యాత్ర విజయవంతం అయింది. ప్రతిరోజు ప్రజలు బ్రహ్మదధం పట్టారు. పెద్దఎత్తున తరలి వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 19వ తేదీన యాత్ర జాత మొదలై, 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు జూలూరుపాడు మండలంలోకి ప్రవేశించింది. మూడు రోజుల పాటు అనేక సభలు, సమావేశాలు నిర్వహిం చాం. ముఖ్యంగా 500 మోటారు బైక్ ర్యాలీలు ఆకర్షనీయంగా కనిపిం చింది. ప్రజా నాట్యమండలి కళాకారుల ఆట, పాటలు, నృత్య ప్రదర్శనలు సామాన్య ప్రజల్లో చైతన్యస్పూర్తిని రగిల్చాయి. జిల్లాలో జన చైతన్య యాత్ర 19వ తేదీన చర్లకు చేరుకుంది. వేలాది మందితో చర్లలో భారీ బహిరంగ సభ జరిగింది. 20వ తేదీ దుమ్ముగూడెం, లక్ష్మీపురంలో జరిగిన బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పాల్వంచలో 21వ తేదీన అంబేద్కర్ సెం టర్లో జరిగిన బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. వేలాది మంది సభలో పాల్గొన్నారు. సాయంత్రం సుజాతనగర్లో రోడ్‌షోలో వేలాది మంది, 5 గంటలకు జూలూరుపాడులో జరిగిన సభ లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జిల్లాలో మూడు రోజు
ల పాటు జరిగిన జన చైతన్య యాత్రలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, కేంద్ర కమిటి సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగన్న, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు మల్లు లక్ష్మీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్లు పాల్గొన్నారు. వారివారి ప్రసంగాలతో జన చైతన్య యాత్రం విజయవంతంగా ముగిసింది. ప్రజలు సానుభూతి పరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి యాత్ర విజయవంతానికి సహకరించారు.
ప్రజల్లో చైతన్యాన్ని నింపింది
కేంద్ర బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక, వ్యతిరేక విధానాలను జన చైతన్య యాత్ర ప్రజల్లో చైతన్య నింపింది. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరలు, గ్యాస్, పెట్రోలు లాంటి వాటిపై పెంచుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు దృష్టి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పైనే దృష్టి పెట్టారు. ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యాత్రలో నాయకుల ప్రసంగాల ద్వారా వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, హిందుత్వ, మతోన్మాద విధానాలను ప్రజల వద్దకు తీసుకువెళ్దాం. ఈ యాత్ర ద్వారా కేంద్ర బిజెపి ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఎండగట్టడం జరిగింది. కేంద్ర బిజేపి ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోని ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రజల ముందు ఉంచాం. పాండురంగాపురం రైల్వే లైన్, దశల వారిగి జరుగుతున్న సింగరేణి ప్రైవేటీకరణ, భద్రాచలం అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, బిజేపి ప్రభుత్వం భద్రాచలం పరిసర ప్రాంతంలోని 5 పంచాయతీలను ఆంధ్రప్రదేష్లో కలిపింది. తిరిగి వాటిని తెలంగాణలో కలపాలని చేసినప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి తీవ్ర నష్టాన్ని చేసింది. పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ) మూసివేసే వేగంగా అడులగులు వేస్తుంది. రాష్ట్రా విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ లాంటి విభజన హామీలు నెరవేర్చలేదన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచడం, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెడుత్ను తీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం జరిగింది. ఈనెల 29న హైద్రాబాద్‌లో జరిగిన చైతన్య యాత్ర ముగింపు సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారు మూల ప్రాంతాల నుండి వేలాంది మందిని రైలు, బస్సు, ప్రయివేటు వాహనాల ద్వారా సభకు తరలించాం. ముఖ్యంగా మూడు రోజుల పాటు సాగిన జన చైతన్య యాత్ర లక్ష్యం నెరవేరింది.