Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళ్లర్పించిన పార్టీ జిల్లాకార్యదర్శి నున్నా
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం విశ్వనాధపల్లికి చెందిన సీపీఐ(ఎం) నాయకులు వల్లభినేని మాధవరావు(71) గురువారం మృతి చెందాడు. ఇటివల లివర్, మూత్రపిండాల వ్యాధితో బాదపడుతూ ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్ధితి విషమించి మాధవరావు మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యమ్మ, కుమారుడు వల్లభినేని మురళిమోహన్ ఉన్నారు. కుమారుడు మురళీమోహన్ సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారు. మృతదేహాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సందర్శించి పార్టీ పతాకాన్ని మృతదేహం ఉంచి నివాళ్లు ఆర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈసందర్బంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ వల్లభినేని మాధవరావు నిక్సరైన నాయకులని కొనియాడారు. తాను నమ్మిన సిద్దాంతాలను కుమారులు కూడా అనుసరించేలా చేశారన్నారు. పేదల బాధల పట్ల స్పందించే మాధవరావు మరణం కుటుంబానికే కాకుండా పార్టీకి తీరని లోటన్నారు. మాధవరావు మృతదేహాన్ని సందర్శించి నివాళ్లు ఆర్పించిన వారిలో మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీటీసీ వడ్డె అజరుబాబు, విశ్వనాధపల్లి, ఉసిరికాయలపల్లి సర్పంచ్లు హలావత్ ఇందిరాజ్యోతి, బానోత్ బన్సీలాల్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, కే.నాగేశ్వరరావు మండల కార్యదర్శి కే.నరేంద్ర, రేగళ్ల మంగయ్య, ఎస్కె.సైదులు, చిన్న సైదులు, ముండ్ల ఏకాంబరం, సూరపురెడ్డి ఇంద్రారెడ్డి, ఇమ్మడి నర్సయ్య, సురభి కొండలు, తేజావత్ చందర్, ముక్కాసీతారాములు, అన్నారపు కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు అజ్మీర నరేన్, భూక్యా మోహన్రావు, మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.