Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతమ్మ తల్లికి సిరిసిల్ల చేనేత చీర ప్రదానం
- మంత్రి ఇంద్రకరణ్ తో కలిసి తలంబ్రాల సమర్పణ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మౌత్సవంలో ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు గురువారం పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి తలంబ్రాలు సమర్పించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలు సీతారాముల వారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతమ్మ వారికి సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన పట్టు చీరను ప్రదానం చేశారు. ఈ కళ్యాణ బ్రహ్మౌత్సవానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, శ్రీత్రిదండి చినజీయర్ స్వామి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, ఎమ్మెల్యేలు పోడెం వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు వద్దిరాజు నిఖిల్ బాబు, వద్దిరాజు నాగరాజు బాబు, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికార, అనధికార ప్రముఖులు సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు. కళ్యాణం అనంతరం వేద పండితులు ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మి పుణ్య దంపతులకు తలంబ్రాలు అందజేశారు. ఎంపీ వద్దిరాజు, ఆయన కుమారుడు నిఖిల్ బాబు, సీతారామ చంద్రస్వామి వారి పల్లకీ మోశారు.
పానకం పంపిణీ
శ్రీ సీతా రాముల కల్యాణ మహౌత్సవ సందర్భంగా శ్రీ స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీచౌక్ లో పెనుగొండ భాస్కర్ రావు ఇంటి వద్ద 11వ వార్షిక పానకం వితరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. వేసవి ఎద్దడి దష్ట్యా భక్తులను వేసవి తాపం నుండి తప్పించేందుకు చల్లని ఈ పానకంను గత 10సంవత్సరాలు గా మిత్రుల సహకారముతో వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కన్వీనర్ తూములూరి లక్ష్మీ నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్థంభాద్రి సేవా సమితి కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు, సభ్యులు పల్లా లింగయ్య, గజ్జి సూర్యనారాయణ, సోమారపు సుధీర్, జంగిలి రమణ, కుమ్మరకుంట్ల మురళి, బజ్జురి రమణారెడ్డి, సూరినేటి మల్లేశం, వివీ సుబ్బారావు, పెనుగొండ సాయికుమార్ తదితర సభ్యులు, గో సేవకులు పాల్గొన్నారు.