Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
నవతెలంగాణ-బూర్గంపాడు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిది ఏండ్లుగా దేశంలో కార్పొరేట్ మతోన్మాద అనుకూలంగా విధానాలను అమలు చేస్తూ, రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం ప్రాంతంలోనూ పేపర్ గోడౌన్ కర్మాగారాలలో ఏప్రిల్ 5న జరిగే కార్యక్రమం పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన అన్నారు. కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రచారం చేస్తూ, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘాలు రైతు గ్రామస్థాయి నుండి కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక వర్గ ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. కార్మికులకు కనీసం వేతనం రూ.26,000 ఇవ్వాలని, పెన్షన్ రూ.10,000 అందరికీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు లేబరు కోడ్స్‌ను, విద్యుత్తు సవరణ బిల్లులు రద్దు చేయాలని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కనీస వేతనం 600 ఇవ్వాలని, రెండు వందల రోజులు పని కల్పించాలని ఆయన పేర్కొన్నారు. రైతుకు గిట్టుబాటు రేటు కల్పించాలని ఈ డిమాండ్లుతో పెద్ద ఎత్తున ఢిల్లీలో ఐదు లక్షల మందితో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, సీఐటీయూ కోకన్వీనర్ గుంటక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.