Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీ మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ
- సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలను రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5న చలో ఢిల్లీ మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీకి కార్మికులు, కర్షకులు అంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. అఖిల భారత సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్రంలో సీఐటీయూ తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామస్థాయి నుండి మండల జిల్లా కేంద్రాల వరకు ఫిబ్రవరి, మార్చి నెలలు పూర్తిగా విస్తృత ప్రచారం జరిపిందని నాయకులు అబ్దుల్ నబీ తెలిపారు. కార్మిక హక్కులు, చట్టాల రక్షణ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు పని దినాలు 200 రోజులకు పెంచి కనీస వేతనం రూ.600గా నిర్ణయించడం ధరల పెరుగుదలను నియంత్రించడం రైతు పండించే అన్ని ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు గ్యారెంటీ చేయాలని ఒకేసారి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం 60 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలని తదితర డిమాండ్ల కోసం జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని ఢిల్లీ నరేంద్ర మోడీ పీఠాన్ని గడగడలాడించాలని వారు పిలుపునిచ్చారు.