Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ పక్రియకు మరోసారి అవకాశం ఇచ్చారని, ఈ సారైనా పట్టాల పంపిణి ప్రక్రియ పారదర్శకంగా జరగాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ళుగా ఇల్లు కట్టుకొని జీవిస్తున్న వారికి యాజమాన్య హక్కు కల్పించడం కోసం ఎన్ని జీవోలు తీసుకువచ్చినప్పటికీ పేదవాడికి ఇంటి పట్టా అందని ద్రాక్షలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు, నాగుల రవికుమార్, ఆట శ్రీకాంత్, సిద్దంకి మల్లేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.