Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సీఐటీయూ) పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్, ఏరియాలో వివిధ డిపార్ట్ మెంట్లలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నేడు కొత్తగూడెం సింగరేణి సివిల్ కార్యాలయం ముందు సాయంత్రం 5 గంటలకి జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శలు డి.వీరన్న, సూరం ఐలయ్య కార్మికులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం రైటర్ బస్తి, హెడ్ ఆఫీస్, ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ తదితర ఏరియాలలో జరిగిన గ్రూప్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ గతంలో సింగరేణి యాజమాన్యం సమ్మె సందర్బంగా ఇచ్చిన హామీలు ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, 7వ తేదీ లోపు ప్రతినెల జీతాలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఆసుపత్రితో వైద్య సేవలు అందించాలని, కరోనా టైంలో మరణించిన కార్మికులకు రూ.15లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం సివిల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి జి.శ్యామ్, నాయకులు ప్రభాకర్, సంజీవ్, కృష్ణ, సుందర్, సురేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.