Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ ఉద్యోగులుగా పదవివిరమణ పొందిన విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ఎల్లప్పుడూ కృషి చేస్తానని కొత్తగూడెం నియోజ కవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం పాల్వంచ శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవనం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు ముఖ్యఅతిథి వనమాచే జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం పాల్వంచ నాయకులు చింతోజు బ్రహ్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వనమా మాట్లాడుతూ గతంలో విశ్రాంత ఉద్యోగుల అభ్యర్థన మేరకు కార్యాలయ భవనానికి స్థలం కేటాయించానన్నారు. ఎలాంటి సమస్యలపైనైనా తన వద్దకు వస్తే పరిష్కారానికై కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు వనమాను పూలమాల, శాలువాలతో సన్మానించారు.
రిటైర్డ్ పశు వైద్యుడిని సన్మానించిన వనమా
సమావేశంలో పశువైద్యాధికారిగా పనిచేసి, పదవి విరమణ పొంది, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్న డాక్టర్ కె.రాఘవేంద్రరావును వనమా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు అజరయ్యా, సెక్రటరీ ఆర్.వెంకటేశ్వరరావు, చింతోజు బ్రహ్మరావు, పెద్దమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ మహిపతి రామలింగం, డైరెక్టర్ ఎస్.వి.ఆర్.కె.ఆచార్యులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, కాల్వ ప్రకాశరావు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.