Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక తప్పుడు పద్ధతులతో ఏదో రకంగా కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి లబ్ధిపొందాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. ఇదే నేపధ్యంలో ఇటీవల కేసీఆర్ కుమార్తె కవితపై, కుమారుడు కేటీఆర్‌పై ప్రతిపక్ష పార్టీల నాయకులు పొంతన లేకుండా విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలను గులాబీ శ్రేణులే తిప్పి కొడతారని సండ్ర స్పష్టం చేశారు. శుక్రవారం సత్తుపల్లి మండలం బేతుపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ ఆహ్వానాల కార్యక్రమం అనంతరం సండ్ర విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయిలో గ్రామగ్రామాన గులాబీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా వక్రబుద్దితో వ్యవహరిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు అది గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఎవరెన్ని ఎత్తులు, జిత్తులు వేసినా బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించలేరని ఎమ్మెల్యే సండ్ర స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల ఎంపీపీలు దొడ్డా హైమవతిశంకరరావు, లక్కినేని అలేఖ్యవినీల్, నాయకులు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, దొడ్డా శంకరరావు, అంకమరాజు, రఫీ, కొండపల్లి రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారాన్ని మరిపిస్తున్న
బీఆర్ఎస్ ఆత్మీయ సభల ఆహ్వానాలు
మేళతాళాలతో ఇంటింటికి ఆహ్వాన పత్రాలతో ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి నియోజకవర్గంలో 2 నుంచి ప్రారంభం కానున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశాల సందడి ఎన్నికల వాతావరణాన్ని మరిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈనెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల ఆత్మీయ సభలు జరుగునున్నాయి. అధినేత ఇచ్చిన పిలుపుతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియోజకవర్గ వ్యాప్తంగా 16 ఆత్మీయ సభలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2న సత్తుపల్లి మండలం గంగారంలో జరిగే ఆత్మీయ సమావేశంతో ఈ ఆత్మీయ సమ్మేళన సభలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర ఆత్మీయ సభలకు ప్రజలను ఆహ్వానించే కార్యక్రమాన్ని బేతుపల్లి నుంచి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులను వెంటేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ముద్రించిన కరపత్రాలతో ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆహ్వానం పలుకుతున్నారు.
అభివృద్ధిలో భరణిపాడు పాఠశాల ఆదర్శం
వేంసూరు : అభివృద్ధిలో భరణిపాడు పాఠశాల ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు శుక్రవారం మండల పరిధిలోని భరణిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. దళిత కాలనీలో కమ్యూనిటీ హాల్, సిసి రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మన ఊరు మన బడి కార్యక్రమంలో మొదటి విడతలు పనులు పూర్తి చేయటం పట్ల అభినందించారు. ఈ పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మౌలిక వసతులతో నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు రత్నరాజు మాజీ సర్పంచ్ మందపాటి మహేశ్వర్ రెడ్డి సర్పంచి సునీత వెంకటరెడ్డి సొసైటీ అధ్యక్షులు కూరపాటి నానినీ అభినందించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవానికి సహకరించిన దళిత కాలనీ వాసులకు చర్చి అభివృద్ధి పనులకు 50 వేల నగదు సర్పంచ్ సునీత వెంకటరెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఫాస్టర్‌కు అందజేశారు జిల్లా స్థాయిలో అవార్డు తీసుకున్న సర్పంచిని పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాల వెంకటరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు ఆత్మ చైర్మన్ వాసు దొడ్డ వెంకట కష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డి మోరంపూడి ముత్తయ్య ఎంఈఓ సిహెచ్ వెంకటేశ్వరరావు తో పాటు వివిధ శాఖల అధికారులు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.