Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెనుబల్లి
పెనుబల్లి మండలం మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన గాలి వర్షంతో మామిడికాయలు నేల రాలాయి. ఒక్కసారిగా పెనుగాలి వీచడంతో కరెంటు స్తంభాలు నేలకొరిగి విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. మామిడి కాయలకు ధర అంతంత మాత్రం ఉన్న తరుణంలో గాలి దుమ్ములు కారణంగా కాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల పంట చేతికొచ్చిన మొక్కజొన్న కూడా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న భూమిపై చాప మాదిరిగా పడిపోయి మొక్కజొన్న రైతులకు నష్టపోయారు. లంక సాగర్. రామచంద్ర రావు బంజర్. కొత్త కారాయి గూడెం, మరలకుంట గ్రామాల్లో మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు పంట నష్టంపై అంచనాలు రూపొందించి నష్టపరిహారం అందజేయాలని బాధితరైతులు కోరుతున్నారు.
అకాల వర్షానికి వరి, మామిడి పంటలకు నష్టం
కల్లూరు : అకాల వర్షానికి మండలంలో మావిడి, వరి పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం అకస్మాత్తుగా గాలితో కూడిన ఓ మోస్తరు భారీ వర్షం పడటంతో కోతకు సిద్ధమైన వరి పంట నేలకొరిగింది. మండలంలో సుమారు 30 వేల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. గత 15 రోజులు క్రితం తుఫాను ప్రభావంతో వర్షాలు పడటంతో కోతకొచ్చిన వరి పొలాల సైతం కొయ్యలేకపోయారు. ప్రస్తుతం వస్తున్న ఎండలకు భూమి తడి ఆరిపోవటంతో కోతలు కోయటానికి సిద్ధమవుతూ అక్కడక్కడ మెరక ప్రాంతాల్లో ఇప్పుడే కోతలు ప్రారంభించారు. కోతకు సిద్ధమై వరి పొలాలు బాగా ఎండిపోవడంతో ఇప్పుడొచ్చిన వర్షానికి గాలికి ధాన్యం రాలిపోయేవకాశాలు ఎక్కువ ఉన్నాయని రైతులంటున్నారు. 1010 ధాన్యం రకం కోతకు వచ్చిన తర్వాత పంట తూలిపోయి రాలిపోయే రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ కోతల ప్రారంభించడానికి పది రోజులు పైనే పట్టి అవకాశం ఉందని. రైతులంటున్నారు. సుమారు ఎకరానికి ఒకటి నుండి రెండు బస్తాల వరకు రాలిపోయే అవకాశం ఉందని, దీనికి తోడు కింద పడిపోవడంతో కోత ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. గాలి దుమ్ముకి మామిడికాయలు రాలిపోయే రైతులు తెలిపారు. అకాల వర్షం వల్ల రబీ రైతులకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.