Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళ్లర్పించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- రఘునాథపాలెం
మండల పరిధిలోని కామంచికల్ గ్రామ పంచాయతీలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు నువ్వుల కాంతమ్మ శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో కుమారుడు నువ్వుల రామకృష్ణ యూటీఎఫ్‌లో పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కాంతమ్మ పార్థివ దేహానికి జెండా కప్పి పూలదండ వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, రఘునాధపాలెం మండల కార్యదర్శి నవీన్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి అనంతని వీరయ్య, శాఖ సభ్యులు చెరుకూరి మురళి, హనుమంతు శేషగిరి, నువ్వుల కృష్ణయ్య, గండు లక్ష్మీనారాయణ, చెరుకూరి వెంకట నరసయ్య, కొమ్మినేని నాగేశ్వరరావు, సిపిఐ సీనియర్ నాయకుడు మేదర మెట్ల వెంకట రమణయ్య, బోజెడ్ల సూర్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు మేదరమెట్ల శ్రీను, గ్రామ సర్పంచ్ మేదరమెట్ల వెంకటరమణ, గ్రామ వైస్ సర్పంచ్, బొప్పి ప్రభాకర్, రైతు వేదిక అధ్యక్షులు ప్రతాపనేని గాంధీ, గ్రామ ప్రజలు నివాళులు నివాళులు అర్పించారు.