Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ- అశ్వారావుపేట
బీఆర్ఎస్ ఆద్వర్యంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రతీ పధకం ప్రజలకు చేరువ అయిందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని చెప్పారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మెచ్చా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమర్ధ పాలనతో దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనను ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భవించిందని వివరించారు. అదేవిధంగా నడిచిన నాలుగేళ్ళలో సీఎం కేసీఆర్ సహాకారంతో నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గం వ్యాప్తంగా రైతు బంధు పథకం కింద 3.18 లక్షల మంది రైతులకు రూ.523 కోట్లు ఆర్ధిక సాయం అందించానని, రైతు భీమా పథకంలో 740 మంది రైతులు మృతి చెందితే రూ.37 కోట్ల భీమా సొమ్మును రైతు కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు.1380 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు కాగా వీటిలో 953 ఇళ్ళు పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేశామని, మిగతా 211 ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయని, కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ పథకాల ద్వారా 3,533 మంది లబ్దిదారులకు రూ.4.3.34 కోట్లు ఆర్ధిక సాయం. మంజూరు చేసినట్లు చెప్పారు. ఆసరా పథకంలో 23,742 మంది లబ్దిదారులకు రూ.12.23 కోట్లు ప్రతి నెలా నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో 100 మందికి దళిదబంధు పథకంలో రూ.10 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్ల ద్వారా 1,273 మందికి 15.82 కోట్లు రుణాలు పంపిణీ చేశామని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 34.53 కోటతో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణం, ఆర్అండ్ శాఖ ద్వారా 32.70 కోట్లతో 27 బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్ కోసం రూ.33.25 కోట్లు, సీఎంఆర్ఎఫ్ పథకంలో ప్రయివేట్ ఆసుత్రుల్లో చికిత్స చేయించుకున్న 1,470 మందికి 7.78 కోట్లు ఆర్ధిక సాయం అందిచామని వివరించారు. ఇరిగేషన్ శాఖలో రూ.21 కోట్లతో 13 చెక్ డ్యామ్ లు, మిషన్ భగీరధ పథకంలో 82 కిలో మీటర్లు. పైపు లైన్ నిర్మాణం జరిగిందని, ఐటీడీఏ ద్వారా 73.30 కోట్లతో సీసీ, బీటీ రోడ్లతో పాటు భవనాలు, చెక్ డ్యామ్లు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సెంటర్ల, మోడల్ స్కూల్స్, పాఠశాలల్లో అదనపు తరగతులను నిర్మించినట్లు చెప్పారు. ములకలపల్లిలో రూ.1.50 కోట్లతో పీహెచ్ సీ భవనం, మన ఊరు-మన బడి పథకానికి రూ.19 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. దీనితో పాటు ఆర్టీఏ కార్యాలయం, దమ్మపేటలో కోర్టు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, అశ్వారావుపేటలో వచ్చే విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభించనున్నామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్, డీఎస్సీ కార్యాలయాలు ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ప్రజలకు ఏది అవసరమో వాటిని అందించటమే తన ప్రదమ కర్తవ్యంగా చెప్పారు. ఎమ్మెల్యే పదవి సామాజిక బాధ్యతగా భావిస్తానని, ప్రజలు సంతృప్తి చెందితే అప్పుడే నా లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సహాకారంతో మరింత అభివద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక, స్థానికేతర ప్రజాప్రతినిధులు శ్రీరామమూర్తి, ఫణీంద్ర, వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, నాయకులు బండి పుల్లారావు, సత్యవరపు సంపూర్ణ, యు.ఎస్ ప్రకాశ్ రావు , కాసాని చంద్రమోహన్, మాజీ జడ్పీటీసీ జేకేవి రమణారావు తదితరులు పాల్గొన్నారు.