Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా పరిధిలోని పలు గనులు, ఓపెన్ కాస్టు బొగ్గు గనుల వద్ద కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు అందించే కార్యక్రమాన్ని శనివారం నుండి ప్రారంభించారు. ఏరియా జిఎం జక్కం రమేష్ ఆదేశాల మేరకు వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలలో భాగంగా జీకే ఓసిలో చల్లటి మజ్జిగ ప్యాకెట్లను పంపిణి కార్యక్రమాన్ని ఏరియా ఎస్ఓ టు జిఎం, ప్రాజెక్టు అధికారి శ్రీరమేష్ ప్రారంభించారు. ఈ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీని 75 రోజుల పాటు ఏప్రిల్ 1వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు జనరల్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు, కార్మికులకు ఉచితంగా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎస్.కె కరీముల్లా, గని మేనేజర్ ఎస్ఎస్ఆర్.మురళి,సేఫ్టీ ఆఫీసర్ వి.శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎం.శ్రావణ్ కుమార్, పిట్ సెక్రటరీ సిహెచ్.నాగరాజు, ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.