Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సాంకేతిక విజ్ఞాన అవగాహనాలో భాగంగా శుక్రవారం హైదరాబాదులోని జీడిమెట్ల గల ఇస్రో కేంద్రంలోని నేషనల్ రిమోట్ పెన్సిల్ సెంటర్ను సందర్శించారు. ఎన్ఆర్ఎస్సీలో భాగమైన జియో ఫేషియల్ డేటా అంతరిక్ష ప్రయోగిక సాటిలైట్లు వాణిజ్య ఉపగ్రహాలు వాటి అనువర్తనాలు మ్యాఫిన్ అభివృద్ధి వాటికి చెందిన పరిజ్ఞానాన్ని సమాజానికి విద్యార్థులకు అందించడం వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇమ్మడి క్రాంతి కుమార్ పాల్గొన్నారు.