Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్
- ఉపాధ్యక్షురాలిగా రత్నకుమారి ఎన్నిక
నవతెలంగాణ-కొత్తగూడెం
దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్ఎఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తగూడెం, రుద్రంపూర్ ఏరియాకు చెందిన సీనియర్ నాయకులు బందెల నర్సయ్య ఎన్నికయ్యారు. ఇదే ప్రాంతానికి చెందిన సలిగంటి శ్రీనివాస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, లక్ష్మి దేవిపల్లి మండలం శేషగిరి నగర్‌కు చెందిన కె.రత్నకుమారి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఇటీవల హైద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన రాష్ట్ర మహాసభలో వీరిని ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో ముగ్గురికి జిల్లా నుంచి కార్యవర్గంలో స్థానం లభించింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బందెల నర్సయ్య మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రజర్వేషన్ల అమలుకోసం దశలవారి ఉద్యమాలు చేపడతామన్నారు. అదేవిదంగా సబ్‌ప్లాన్ నిధులు ఇతర శాఖలను మల్లించకుండా చర్యలు చేపట్టా లని, దళితబంధు పథకం ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న అవినీతి అక్రమా లను నివారించేందుకు ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేల నుంచి తొలగించి కలెక్టర్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల రద్దుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దళిత, గిరిజనులంతా మేల్కోని మోడీ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర మహాసభ ఆమోదించిన తీర్మాణాలపై దశలవారి ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.