Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మ మరణం కార్మిక పోరాటాలకు తీరని లోటు
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మిక సమస్యలపై జరిగిన పోరాటాల్లో వద్ది పద్మ చురుకైన పాత్ర పోషించిందని సీపీఐ(ఎం) సీనియర్ నేత కాసాని ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్ అన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు, సీఐటీయూ ప్రభుత్వ హాస్పిటల్ కార్మిక సంఘం నాయకురాలు కామ్రేడ్ వద్ది పద్మ క్యాన్సర్తో శుక్రవారం మరణించారు. శనివారం రామవరంలోని పద్మ ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి అరుణ పతాకాన్ని కప్పి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యూనియన్ ఏర్పాటు చేయడంలో పద్మ కీలక పాత్ర పోషించా రన్నారు. యూనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా కార్మికుల సమస్యలపై జరిగిన ప్రతి పోరాటంలో పద్మ పాల్గొన్నదన్నారు. నాలుగు వందలు ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల జీతాలు రూ.12 వేల వరకు పోరాడి సాధించిన విజయంలో పద్మ పాత్ర ప్రధాన మైనదని అన్నారు. తాను నమ్మిన ఎర్రజెండాను తుది శ్వాస వరకు విడవకుండా, నిజాయితీ కలిగిన కమ్యూనిస్టు పద్మ తన జీవితాన్ని కొనసాగించింది కోనియాడారు. నివాళులు అర్పించిన వారిలో పట్టణ కార్యదర్శి లిక్కీ బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, భూక్యా రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, నగేష్, కర్ల వీరస్వామి, నందిపాటి రమేష్, విజయగిరి శ్రీను, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో నివాళి....
సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకురాలు వద్దె పద్ద మృతి కార్మిక వర్గానికి తీరని లోటని ఐద్వా నాయకురాళ్లు అన్నారు. రామవరంలోని పద్మ ఇంటి వద్ద ఆమె భౌతికాయాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు. ఆమె ఆశయ సాధనకు కృషిచేయాల న్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, పాల్వంచ ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మి, పాల్వంచ కార్యదర్శి వాణి, కమిటీ సభ్యులు అరుణ, విజయ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.